Coronavirus: తెలంగాణలో కొత్తగా 5వేల, 93 పాజిటివ్‌ కేసులు

Coronavirus: నిన్న రాత్రి 8గంటల వరకు 1లక్షా, 29వేల, 637 మందికి కరోనా టెస్ట్‌లు

Sandeep Eggoju
Published on: 18 April 2021 10:12 AM IST
Five Thousand New Corona Positive Cases in Telangana
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిన్న రాత్రి 8గంటల వరకు 1లక్షా, 29వేల, 637 మందికి కరోనా టెస్ట్‌లు చేయగా. కొత్తగా 5వేల, 93 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు. రాష్ట్రంలో నిన్న కరోనాతో 15 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,824కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,555 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3లక్షల, 12వేల, 563కి చేరింది. ప్రస్తుతం 37వేల 37 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24వేల, 156 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 743 కేసులు నమోదయ్యాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story