బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు

Firing on Telangana Police in Bihar
x

బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు

Highlights

Bihar: సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసుల యత్నం

Bihar: బిహార్‌లో తెలంగాణ పోలీసులపై సైబర్‌ నేరగాళ్లు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. వాహన కంపెనీల ప్రాంఛైజీల పేరిట సైబర్‌ మోసాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు బిహార్‌ వెళ్లారు. నవాడా జిల్లాలోని భవానిబిగా గ్రామంలో నిందితుల ఆచూకీ గుర్తించారు. స్థానిక పోలీసుల సాయంతో నిందితులను పట్టుకునే క్రమంలో ప్రధాన నిందితుడు మితిలేష్ ప్రసాద్‌ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.22 కోట్ల నగదు, 3 కార్లు, 5 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకురానున్నట్టు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories