ఆదిలాబాద్ తాడిగూడ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్ మృతి

X
Highlights
* హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన జమీర్ * ఈనెల 18న జమీర్‌పై కాల్పులు జరిపిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఫారూఖ్
admin26 Dec 2020 3:36 AM GMT
ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ మృతిచెందాడు. ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఫారూఖ్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జమీర్‌ను.. చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న సయ్యద్ ఉదయం చనిపోయాడు.
ఇటీవల ఫారూఖ్ ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డాడు. తల్వార్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో మొతేషీన్ నడుములోకి ఒక తూటా దూసుకుపోగా, సయ్యద్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. అయితే వెంటనే వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ సయ్యద్ మృతి చెందాడు.
Web TitleFiring case issue in Thadiguda Adilabad district
Next Story