Sangareddy: సంగారెడ్డి జిల్లాలో భారీ ప్రమాదం.. SB ఆర్గానిక్ కెమికల్‌ కంపెనీలో పేలిన రియాక్టర్‌

Fire Accident In SB Organic Chemical Company
x

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో భారీ ప్రమాదం.. SB ఆర్గానిక్ కెమికల్‌ కంపెనీలో పేలిన రియాక్టర్‌

Highlights

Sangareddy: ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది కార్మికులు

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. SB ఆర్గానిక్ కెమికల్‌ కంపెనీలో రియాక్టర్‌ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో కంపెనీ ఎండీ రవిశర్మ కూడా మృతిచెందారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. హత్నూర మండలం చందాపూర్‌ శివారులో ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు.. పేలుళ్ల ధాటికి సమీపంలోని నిర్మాణాలు కూడా కూలడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది.. మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories