logo
తెలంగాణ

నల్గొండ జిల్లాలో అగ్నిప్రమాదం

Fire Accident in Nalgonda District
X

representational Image

Highlights

* హైదరాబాద్‌ కాటన్‌ ఇండస్ట్రీలో చెలరేగిన మంటలు * మంటల్లో కాలిబూడిదైన పత్తి.. రూ.15 లక్షలు ఆస్తినష్టం * మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది

నల్గొండ జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొండమల్లేపల్లి పరధిలోని ఆంబోతుతండా దగ్గర ఉన్న హైదరాబాద్‌ కాటన్‌ ఇండస్ట్రీలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. మంటల్లో పడి కొంత పత్తి అగ్నికి ఆహుతైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు 15 లక్షల ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Web TitleFire Accident in Nalgonda District
Next Story