Hussian Sagar: హుస్సేన్ సాగర్ లో తప్పిన పెను ప్రమాదం.. దగ్ధమైన బోటు

Massive fire breaks out in Gulzars house, five dead
x

Hyderabad: గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Highlights

Hussian Sagar: మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్బంగా రాత్రి 9గంటల సమయంలో హుస్సేన్ సాగర్ లో బోట్ల నుంచి బాణసంచా పేల్చుతున్న సమయంలో అగ్నిప్రమాదం...

Hussian Sagar: మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్బంగా రాత్రి 9గంటల సమయంలో హుస్సేన్ సాగర్ లో బోట్ల నుంచి బాణసంచా పేల్చుతున్న సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బోటులో ఉన్న ఐదుగురు వ్యక్తులు నీళ్లలోకి దూకారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మంటల ధాటికి రెండు బోట్లు పూర్తిగా దగ్దమయ్యాయి. దీనికి కొద్దక్షణాల ముందే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అనంతరం ఒక జెట్టీలో బాణాసంచాను ఉంచి వాటిని పేల్చేందుకు ఐదుగురు సహాయకుల అందులోకి ఎక్కారు. ఈ జెట్టీని మరో బోటు కు కట్టి సాగర్ లోకి తీసుకెళ్లి బాణసంచా పేల్చడం ప్రారంభించారు. రాకెట్ పైకి వేసే క్రమంలో అది అక్కడే బాణసంచాపై పడి పేలడంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతనికి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెలిగిన నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories