తెలంగాణలో మరో అగ్ని ప్రమాదం

తెలంగాణలో మరో అగ్ని ప్రమాదం
x

ప్రతీకాత్మక చిత్రం 

Highlights

Fire Accident In Sangareddy : తెలంగాణ రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Fire Accident In Sangareddy : తెలంగాణ రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంతో సుమారుగా 12 గంటల పాటు దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్ముకున్నాయి. కాగా ఆ ప్రమాదంతో తొమ్మిది మంది మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఇంకా మరచిపోకముందే రాష్ట్రంలో మరో అగ్ని ప్రమాద సంఘటన చోటు చేసుకుంది. కెమికల్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి తీవ్ర ఆస్తి నష్టం జరిగింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే గుమ్మడిదల బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని సాల్వెంట్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకంది. ఒక్కసారిగా గోడౌన్ లో అగ్ని వెదజల్లడంతో మైళ్ల దూరం నుంచి మంటలు కనిపించాయి. దీంతో అప్రమత్తమయిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంధికి సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ఆపరేషన్లు కొనసాగించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం గోడౌన్లో కెమికల్స్‌తో కూడిన భారీ కంటైనర్లు ఉన్నట్టు సమాచారం.

దీంతో గోడౌన్ లో మంటలు ఒక్కసారిగా వ్యాపించి, ఆరడానికి సమయం పడుతోందని తెలుస్తుంది. కాగా ఇక ఈ ప్రమాదం జరగడానికి సరైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతమైతే అధికారులు ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు గోదాంలో ఎంత మంది ఉన్నారు? అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories