Congress: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

Finalization of Congress candidates for MLC elections
x

Congress: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

Highlights

Congress MLC: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్‌కుమార్‌ గౌడ్, బల్మూరి వెంకట్

Congress MLC:కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఇవాళ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను కాంగ్రెస్ హై కమాండ్ ఎంపిక చేసింది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో.. వెంకట్‌, మహేష్‌కుమార్‌ రేపు నామినేషన్‌ వేసే అవకాశం ఉంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి.

అయితే.. మొదట ఈ రెండు స్థానాలకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఇవాళ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్‌లో అనూహ్యంగా అద్దంకి దయాకర్‌కు చోటు దక్కకపోవడం.. రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడంతో అద్దంకికి మరో పోస్ట్ ఏదైనా ఇస్తారనే చర్చ జరుగుతోంది.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాతో ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ పోస్ట్‌లు ఖాళీ అయ్యాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుండగా.. 29న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories