సకల జనుల సమ్మె రికార్డును బ్రేక్ చేసిన ఆర్టీసీ సమ్మె

RTC strike
x
RTC strike
Highlights

ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మె రికార్డును బ్రేక్ చేసింది. ఆర్టీసీ చరిత్రలో సుదీర్ఘ కాల సమ్మెగా గుర్తింపు పొంది సరికొత్త రికార్డుల్లోకి ఎక్కింది. 43...

ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మె రికార్డును బ్రేక్ చేసింది. ఆర్టీసీ చరిత్రలో సుదీర్ఘ కాల సమ్మెగా గుర్తింపు పొంది సరికొత్త రికార్డుల్లోకి ఎక్కింది. 43 రోజులుగా సాగుతున్న సమ్మెపై అటు కార్మికులు, ఇటు సర్కారు మెట్టు దిగకపోవడంతో రోజు రోజుకు టెన్షన్‌గా మారింది. బస్ రోకోకు ఆర్టీసీ కార్మికులు దిగితే ఇటు ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ హైకోర్టులో ఫైనల్ అఫిడవిట్‌ను దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. గంట గంటకు ఉద్రికంగా మారుతున్న ఆర్టీసీ సమ్మెపై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కాక రేపుతోంది. ఓవైపు కార్మికుల నిరసనలు మరోవైపు హైకోర్టులో విచారణతో రోజుకో ట్విస్ట్ ఎదురవుతోంది. తాజాగా సమ్మెకు సంబంధించి ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ హైకోర్టులో ఫైనల్ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని ఆర్టీసీ కార్పొరేషన్ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందని తెలిపారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని సమ్మె కారణంగా ఇప్పటి వరకు 44శాతం ఆర్టీసీ నష్టపోయిందని అఫిడవిట్‌లో ప్రస్తావించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేమని యూనియన్ నేతలు విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టారన్నారు.

ఆర్టీసీ కార్మికులు మళ్లీ విలీనం డిమాండ్‌తో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ ప్రస్తావించారు. యూనియన్‌ నేతలు స్వార్థం కోసం ఆర్టీసీని నష్టాల్లోకి నెడుతున్నారని యూనియన్ నేతలు సొంత ఉనికి కోసమే సమ్మె చేస్తున్నారన్నారు. అలాంటి సమ్మెను చట్ట విరుద్ధం అని ప్రకటించాలని కోరుతున్నామని ప్రభుత్వంపై కుట్రపూరితంగా వ్యవహరించేందుకు జేఏసీ నేతలు ప్రతిపక్షాలతో చేతులు కలిపారని ఆరోపించారు. హైకోర్టు ఆర్టీసీ సమ్మె మిగిలిన సమస్యల పరిష్కారానికి సుప్రీం మాజీ న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటు చేస్తామనగా ఆ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నెల 18న హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరగనుండటంతో ఆర్టీసీ ఎండీ అఫిడవిట్‌ దాఖలు చేశారు. మరి ఈ అఫిడవిట్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ సమ్మెను రోజు రోజుకు ఉధృతమతోంది.

సమ్మె 43 రోజుకు చేరి సకల జనుల సమ్మె రికార్డును బద్దలుగొట్టింది. సుదీర్ఘకాలంపాటు జరిగిన సమ్మె రికార్డులకెక్కుతోన్న సర్కారులో చలించకపోవడంతో కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా బస్సు రోకో నిర్వహించారు. కార్మికుల బస్ రోకోకు అనుమతి లేదన్న పోలీసులు.. ఆర్టీసీ జేఏసీ నేతల్ని ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. అలాగే జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో.. మహిళలతో కలిసి తన ఇంట్లోనే దీక్షకు దిగారు. ఇటు అవాంచనీయ ఘటన జరగకుండా ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బస్ భవన్, వీఎస్టీ, రాంనగర్, విద్యా నగర్ ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories