టాలీవుడ్‌ నటుడికి గన్‌తో బెదిరింపు.. భూ కబ్జాకు యత్నం..!

Film Actor Randhir Reddy was Threatened in Vikarabad District
x

టాలీవుడ్‌ నటుడికి గన్‌తో బెదిరింపు.. భూ కబ్జాకు యత్నం..!

Highlights

*గతంలో 28 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన రణధీర్‌రెడ్డి

Vikarabad: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో గన్ కల్చర్ పెరిగిపోయింది. ఏకంగా సినీ నటుడు రణధీర్‌రెడ్డిని తుపాకీతో బెదిరించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం హిమాంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 13 నుంచి 19 వరకు 28 ఎకరాల 15 గుంటల భూమిని సినీ నటుడు రణధీర్ రెడ్డి కొనుగోలు చేశాడు. ఆ భూమిని చదును చేస్తుంటే ఈ భూమి మాది నువ్వు ఎందుకు చదును చేస్తున్నావని హైదరాబాద్‌కు చెందిన సుల్తాన్ హైమత్ ఖాన్ అనే వ్యక్తి గన్నుతో బెదిరించాడు.

దీంతో డయల్ 100కు పోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు రణధీర్ రెడ్డి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని పీఎస్‌కు తీసుకెళ్లారు. సుల్తాన్ హైమత్ ఖాన్ దగ్గర ఉన్న గన్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్‌కు చెందిన సుభాష్ రెడ్డి దగ్గర భూమి కొనుగోలు చేసినట్లు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని రణధీర్ రెడ్డి చెబుతున్నాడు. మూడ్రోజుల క్రితం కూడా చిన్నపాటి గొడవ జరిగిందని కొందరు నచ్చజెప్పడంతో వెళ్లిపోయారని ఇప్పుడు మళ్ళీ వచ్చి భూమి చదును చేయకుండా అడ్డుకొని కత్తులతో బెదిరించారని నటుడు రణధీర్ రెడ్డి ఆరోపిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories