కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత..

X
కామా రెడ్డి
Highlights
* ఘటన లో ముగ్గురికి తీవ్రగాయాలు
Sandeep Eggoju9 Jan 2021 6:50 AM GMT
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామంలో పాతకక్షలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామ సర్పంచ్ లత భర్త రాజేశ్వర్ కుటుంబ సభ్యులు మాజీ ఉప సర్పంచ్ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సర్పంచ్ లత భర్త ఉప సర్పంచ్ కుటుంబ సభ్యులపై దాడి చేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించడంలేదంటూ వారితో ఉపసర్పంచ్ వాగ్వాదానికి దిగారు. అనంతరం స్వామి ఫిర్యాదు మేరకు సర్పంచ్ లత భర్త రాజేశ్వర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘర్షణలో గాయపడ్డ స్వామి, సిద్దవ్వ, మోహన్‌లను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Web TitleFight between two factions in Kamareddy district
Next Story