హృదయ విదారక ఘటన.. కూతురు శవాన్ని చేతులపై మోసుకెళ్లిన తండ్రి

హృదయ విదారక ఘటన.. కూతురు శవాన్ని చేతులపై మోసుకెళ్లిన తండ్రి
x
Highlights

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సొంత జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ పెద్దపల్లి జిల్లాకు చెందిన కూనారం కోమలత అనే బాలిక మృతిచెందింది....

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సొంత జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ పెద్దపల్లి జిల్లాకు చెందిన కూనారం కోమలత అనే బాలిక మృతిచెందింది. ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు అడిగితే అధికారులు నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో కూతురి శవాన్ని చేతులపై మోసుకెళ్లాడు తండ్రి సంపత్. కూతురు చనిపోతే శవాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్సు కూడా లేకపోవడంతో సంపత్ ఇలా చేశాడు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. అతన్ని చూసిన పలువురు అయ్యో పాపం అన్నారే తప్పా.. ఏమి చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories