Jagtial: ఆడపిల్ల పుట్టిందని.. పురిట్లోనే అమ్మేసిన తండ్రి

Father Sold Her Child While The Child Inside The Stomach
x

Jagtial: ఆడపిల్ల పుట్టిందని.. పురిట్లోనే అమ్మేసిన తండ్రి

Highlights

Jagtial: మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో పురిటి బిడ్డ విక్రయం

Jagtial: మూడో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టిందని ఓ తండ్రి... పురిటి బిడ్డనే అమ్మేశాడు... ప్రశ్నించిన భార్యను అత్తమామలపై దాడికి దిగాడు... జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం గుల్లకోట గ్రామానికి చెందిన జంగిలి లక్ష్మణ్... జ్యోతి దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు... మూడు నెలల క్రితం మూడో సంతానంగా ఆడపిల్ల జన్మించింది...ఆడపిల్ల పుట్టిందని అక్కసుతో లక్ష్మణ్ చిన్నారి కూతురును జమ్మికుంటకు చెందిన ఓ వ్యక్తికి విక్రయించాడు...భార్య జ్యోతి అత్తమామలు పాప గురించి నిలదీయడంతో పాపను అమ్మివేసినట్లు లక్ష్మణ్ ఒప్పుకున్నాడు.

జ్యోతి కుటుంబ సభ్యులతో కలిసి వెల్గటూర్ పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు... పాపను క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు. దీనితో సమస్య సమసిపోక... తన భర్త నుంచి తన పిల్లలకు తనకు రక్షణ కావాలని భర్త దగ్గరికి వెళ్తే పిల్లలతో పాటు తనను కూడా అమ్మకానికి పెడతాడని రోదిస్తూ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories