సీతారామ ప్రాజెక్టు కాలువకింద భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి..

సీతారామ ప్రాజెక్టు కాలువకింద భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి..
x
Highlights

అశ్వపురం మండలం చింత్రియాల కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో సీతారామ ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని పనులను అడ్డుకున్న గ్రామస్తులు.

అశ్వపురం: అశ్వపురం మండలం చింత్రియాల కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో సీతారామ ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని పనులను అడ్డుకున్న గ్రామస్తులు. వెంటనే సంబంధిత అధికారులు తాసిల్దారు సి ఐ గారు సంఘటనా స్థలానికి చేరుకుని భూ నిర్వాసితుల తో మాట్లాడే ప్రయత్నం చేశారు. సర్పంచ్ పాయం భద్రయ్య ఉప సర్పంచ్ అశోక్ కుమార్ జిల్లా కో ఆప్షన్ ఎండి షరీఫ్ అధికారులతో మాట్లాడి వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని మొత్తం గిరిజనులు కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేయాలని తెలియజేశారు.

గతంలో ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారి ఆధ్వర్యంలో టెంటు వేసి లబ్ధిదారులకు అండగా నిలిచి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని అప్పటి కలెక్టర్ తో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించారు. ఇంకా ఆరు గురు రైతులు మిగిలిపోయారు ఇప్పుడు కూడా అలాగే మిగిలిన రైతులు కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు.ఇక్కడి రైతులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories