Top
logo

సిద్దిపేట్‌ జిల్లాలో రైతుల ఆందోళన

Farmers Protest in Siddipet District
X

Representational Image

Highlights

* మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు అదనపు టీఎంసీ కోసం చేస్తున్న భూ సర్వే నిలిపివేయాలని ఆందోళన * గతంలో చేపట్టిన సర్వే మార్గంలోనే పనులు చేపట్టాలని డిమాండ్‌

సిద్దిపేట్‌ జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నుండి సిద్దిపేట రూరల్ మండలం బండ చెర్లపల్లి మీదుగా మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు అదనపు టీఎంసీ కోసం చేస్తున్న భూ సర్వే నిలిపివేయాలని రైతులు రాస్తారోకో నిర్వహించారు. గతంలో ఇదే గ్రామంలో సర్వే చేశారు. ఇప్పుడు ఆ సర్వే కాదని అధికారులు మరొ కొత్త సర్వే మొదలు పెట్టారు. దీంతో కొత్త సర్వేలో తమ భూములను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేపట్టిన సర్వే మార్గంలోనే అదనపు టీఎంసీ కోసం పనులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అక్కడే వంటావార్పు చేపట్టారు. దీంతో రైతులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Web TitleFarmers Protest in Siddipet District
Next Story