రైతుల్ని దీనావస్థ లోకి నెట్టేసిన అకాల వర్షం

రైతుల్ని దీనావస్థ లోకి  నెట్టేసిన అకాల వర్షం
x
Highlights

ఓ వైపు భారీ వర్షం మరోవైపు కళ్ల ముందే కొట్టుకుపోతున్న కష్టం ఆ వర్షంలో ఆ రైతన్నలు చేసిన ప్రయత్నం అందరిని కలిచి వేసింది. అన్నం పెట్టే రైతన్న తాపత్రయం...

ఓ వైపు భారీ వర్షం మరోవైపు కళ్ల ముందే కొట్టుకుపోతున్న కష్టం ఆ వర్షంలో ఆ రైతన్నలు చేసిన ప్రయత్నం అందరిని కలిచి వేసింది. అన్నం పెట్టే రైతన్న తాపత్రయం మనసును కట్టిపడేసింది.

ఆకాశం నుంచి జాలువారుతున్న వర్షం నీళ్లు విత్తనాలను మొలకెత్తేలా చేస్తాయి. పంటలు సంవృద్ధిగా పండేలా చేస్తాయి. అదే వాన పంటను నాశనం చేస్తాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకునే దాకా గ్యారంటీ లేదు. గిట్టుబాటు ధర వస్తుందో రాదో కూడా తెలియదు, తీరా పంట పండి అమ్ముకునే ప్రయత్నంలో పంటను వర్షం ముంచేస్తే ఆ అన్నదాత ఆవేదనా అంతా ఇంతా కాదు.

కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి కొట్టకుపోతుంటే రైతన్న హృదయం కకావికలమైంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవమ్‌పల్లి గ్రామంలో రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు. ప్రకృతి కన్నెర్రజేసింది. ఒక్కసారిగా ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. జోరుగా కురుస్తున్న వర్షంలో ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు కలిచి వేశాయి. కుప్పలపై టర్పాయిన్లు కప్పేందుకు ఆరాట పడ్డారు. ఉన్న కాస్తా టర్పాయిన్లు కప్పుతుండగా.. ఒకవైపు ఈదురు గాలులు అవి కుప్పలపై నిలువ లేకపోయాయి. కళ్లెదుటే ధాన్యం కొట్టుకుపోతుంటే పంటను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వారంలో రెండు సార్లు కురిసిన వర్షం రైతులను కన్నీరు మున్నీరు చేస్తోంది. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాని రైతులు కోరుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories