Warangal: శంకర్‌దాదా ఎంబీబీఎస్ అవతారం ఎత్తిన నకిలీ డాక్టర్

Fake Doctor Halchal in Warangal District
x

Representational Image

Highlights

Warangal: చేతిలో 10 వేలు పెడితే అమ్మ కడుపులోని బిడ్డకు ఆరు నెలలు పడకముదే ఆడోమగో చెప్పేస్తాడు.

Warangal: డాక్టరేట్ లేకున్నా శంకర్‌దాదా ఎంబీబీఎస్ అవతారం ఎత్తాడు అతడు. చేతిలో 10 వేలు పెడితే అమ్మ కడుపులోని బిడ్డకు ఆరు నెలలు పడకముదే ఆడోమగో చెప్పేస్తాడు. 20వేలు జేబులో పెడితే ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ ఆపరేషన్లు చేస్తున్నాడు. కడుపు మీద కత్తెర గాట్లు పడాలా స్మార్ట్‌గా పని అవ్వాలా అని అడుగుతారు.. ఇంకో పదివేల ఎక్కువిస్తే.. మెడికల్ అబ్జర్వేషన్‌లో టాబ్లెట్‌ టీట్మెంట్‌ స్మార్ట్ చేస్తారు. మొత్తంగా పుట్టబోయే ఆడపిల్ల ప్రపంచాన్ని చూడకుండా చేసేందుకు వేలల్లో బిజినెస్ చేస్తున్నారు. తెలంగాణ మెడికల్ హబ్‌గా వెలుగొందుతున్న ఓరుగల్లులో నకిలీ ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ వైద్యులు పెరిగిపోతున్నారు. అర్హత లేకున్నా నకిలీ సర్టిఫికేట్లతో ఆస్పత్రులు పుట్టిస్తున్నారు. అనుభవం, అర్హత లేని టెక్నిషియన్లు, సిబ్బందిని నియమించుకుని వైద్య దందాకు పాల్పడుతున్నారు. ఏకంగా ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్నారు. అక్రమ స్కానింగ్ టెస్టులకు, అడ్డగోలు అబార్షన్లు ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్నాయి. లింగ నిర్దారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినా.. డాక్టర్లు కాసులకు కక్కుర్తి పడి స్కానింగు‌లు చేస్తున్నారు.

వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో అక్రమ నిర్దారణ కేంద్రాలు బడా దందాగా మారింది. ఒక్క వరంగల్‍ అర్బన్‍ జిల్లా పరిధిలో రేడియాలజీ, కార్డియాలజీ, గైనిక్‌‌‌‌, స్కానింగ్‌‌‌‌ సెంటర్లు 180 వరకు ఉన్నాయి. మరెన్నో సెంటర్లు పర్మిషన్‍ లేకుండా నడుస్తున్నాయి.

వరంగల్‌ అర్బన్, రూరల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో ఇదో బడా దందాగా మారింది. వరంగల్ సిటీలోని హన్మకొండ బస్టాంగ్, కాకాజీ కాలనీ, విజయ టాకీస్, రాంనగర్, నయీంనగర్, బీమారం, రామారం, కేయూసీ రోడ్డు లాంటి ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ ఆస్పత్రులు వెలిశాయి. నిబంధనలను అతిక్రమించి స్కానింగ్ చేస్తున్నారు. అక్రమ టెస్టులు, అబార్షన్లు ఎక్కువగా జరుగుతున్నట్టు బాధితులు చెప్తున్నారు.

వరంగల్‌లో జరిగే అక్రమ అబార్షన్లు అన్నీ ఇన్నీకావు.. స్కానింగ్ సెంటర్‌లలో ఉండే నకిలీ డాక్టర్లు కోడ్ లాంగ్వేజ్‌ సీక్రెట్‌గా మెయింటెన్ చేస్తున్నారు. లింగానిర్దారణ చట్టరీత్యం అని తెలిసినా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. బాధితుల వీక్‌నెస్ నకిలీ డాక్టర్లకు బిజినెస్‌గా మారుతోంది. సర్వీస్ ఆధారంగా బిల్లు వసూలు చేస్తున్నారు. 20వేల నుంచి 70వేల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు అంటున్నారు. కాసులకు కక్కుర్తి పడి స్కానింగ్‌లు చేస్తున్నారు. యూట్యూబ్‌లో చూసి అబార్షన్‌ చేస్తున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్రమంగా ఉన్న స్కానింగ్ సెంటర్లు చాలానే ఉన్నారు. అడ్డగోలు ఆపరేషన్‌లకు ఓరుగల్లు కేరాఫ్ అవుతోంది. లింగనిర్దారణ చేసుకునేవారిలో మగపిల్లాడు కావాలనుకునేవారు ఎక్కువగా ఉంటున్నారు. ఒకరిద్దరు ఆడపిల్లలు పుట్టాక మగ సంతానం కావాలనుకునేవారు ఆర్ఎంపీల ద్వారా స్కానింగ్‍ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి సర్టిఫికేట్లు లేకున్నా.. నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్‍ సెంటర్లు, డాక్టర్లు, మెడికల్ షాప్స్ ఈ దందా నడిపిస్తున్నాయి. సర్వీస్‍ ఆధారంగా బిల్లు రూ.20 వేల నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నారు.

హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్క్ ఎదురుగా ఉన్న సిటీ ఆస్పత్రిలో ఇలాంటి బాగోతం మరోసారి బయటపడింది. మెడికల్ రిప్రజెంటీవ్‌ గా పనిచేసే ఇంద్రారెడ్డి అనేవ్యక్తి వచ్చీరానీ వైద్యంతో అబార్షన్లు చేస్తూ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. అబార్షన్లు చేయించుకునేందుకు జిల్లా నుంచే కాకుండా.. పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడకు వస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్న సమయంలో వైద్యాధికారులు దాడి చేసి నకిలీ వైద్యులను పట్టుకున్నారు.

మరోవైపు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ చెప్పే క్రమంలో స్కానింగ్‍ సెంటర్ల కోడ్‍ లాంగ్వేజ్‍ ఓపెన్‍ సీక్రెట్‌ కోడ్‌ను మెయింటెన్స్ చేస్తున్నారు. లోపలకు ఎవ్వరిని మొబైల్‍ తీసుకురానివ్వరు. ప్రతి దాన్ని చాలా సీక్రెట్ చేస్తున్నారు. సిటీ హాస్పిటల్‌పై జరిగిన దాడిలో ఇలాంటి విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తప్పనవి వైద్యారోగ్య శాఖాధికారులు చెబుతున్నారు.

ఇదివరకే డోర్నకల్ ప్రాంతంలో ఇంద్రారెడ్డి డాక్టర్‌ అవతారమెత్తి కొందరితో ఈ దందా చేస్తూ పట్టుబడ్డాడు. అతడి వెనక కొందరు రాజకీయ నాయకులు, హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్ హస్తం ఉండడంతో మళ్లీ అదే దందాను కొనసాగించాడు. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు..

యూ ట్యూబ్ చూసి అబార్షన్లు చేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. సరైన దర్యాప్తు చేయకపోవడం.. ఒకసారి పట్టుబడినా మళ్లీ బెయిల్‌పై బయటకు వచ్చి అదే దందా చేయడం దారుణమంటున్నారు. అమాయకుల అవసరాలను ఆసరా చేసుకుని కొంతమంది దుర్మార్గులు ఇలాంటి దందా చేస్తున్నారు.. వారికి పెద్దల అండ ఉండడంతో మరింత రెచ్చిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు.

ఓరుగల్లులో జరుగుతున్న అనధికార అబార్షన్ల దందా విషయంలో నామమాత్రపు కేసులు, హాస్పిటల్ సీజ్‌లు.. తిరిగి కొన్నాళ్లకు వేరేచోట ఇదే తరహా దందాకు తెరదీస్తున్న వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారిస్తే తప్ప వీటికి చెక్ పెట్టే అవకాశం లేదంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories