ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫేస్‌బుక్ నిషేధం

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫేస్‌బుక్ నిషేధం
x
Highlights

ద్వేషపూరిత ప్రసంగం కేసు వివాదంపై తెలంగాణ రాష్ట్రం గోషామహల్ బిజెపి..

ద్వేషపూరిత ప్రసంగం కేసు వివాదంపై తెలంగాణ రాష్ట్రం గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే టి రాజా సింగ్‌ ఫేస్‌బుక్ ను నిషేధించింది.ఫేస్‌బుక్ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించిన కార‌ణంగా నిషేదం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఫేస్‌బుక్ ప్ర‌తినిధి ఒక‌రు ఈ- మెయిల్ ద్వారా వెల్ల‌డించారు. అయితే తనకు పేస్ బుక్ లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ విషయాన్ని కూడా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అందులో ఇలా పేర్కొన్నారు. 'నాకు ఫేస్బుక్ పేజీ లేదు.

మీడియా ద్వారా నిషేధించడం గురించి నాకు సమాచారం వచ్చింది. నేను ఏప్రిల్ 2019 నుండి ఫేస్‌బుక్ ఉపయోగించడం లేదు.' అని పేర్కొన్నారు. అంతేకాదు కాంగ్రెస్ ఒత్తిడిలో ఫేస్‌బుక్ పనిచేస్తోందా అంటూ ఆయన ప్రశ్నించారు. తన పేరిట ఫేస్‌బుక్‌లో ఉన్న ఫేక్‌ అకౌంట్లను తొలగించినట్లు రాజాసింగ్‌ చెప్పారు. ఇదిలావుంటే ప్ర‌పంచవ్యాప్తంగా అత్య‌ధిక ఖాతాదారులున్న ఫేస్‌బుక్ బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను చూసీచూడనట్లుగా వదిలేస్తోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రచురించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories