Warangal: పేలిన ఒప్పో ఏ 54 మొబైల్.. యువకుడు అప్రమత్తమవడంతో తప్పిన ప్రమాదం

Exploded Oppo A54 Mobile In Warangal
x

Warangal: పేలిన ఒప్పో ఏ 54 మొబైల్.. యువకుడు అప్రమత్తమవడంతో తప్పిన ప్రమాదం 

Highlights

Warangal: వరంగల్ ఏనుమాముల మార్కెట్లో ఘటన

Warangal: వరంగల్ ఏనుమాముల మార్కెట్లో ఓ రైతుకు చెందిన మొబైల్ ఫోన్‌ పేలింది. పెద్ద గూడూరు గ్రామానికి చెందిన అంగోతు జగన్ అనే యువకుడు గురువారం మిర్చి బస్తాలను వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు తీసుకువచ్చాడు . అక్కడే 13వ యార్డులో తన సరుకు దించుకుని.. వ్యాపారుల కోసం ఎదురుచూస్తుండగా, తన జేబులోని మొబైల్ ఉన్నట్టుండి వేడెక్కినట్లు గుర్తించాడు. దీంతో అప్రమత్తమైన రైతు తన ఫోన్ ను దూరంగా విసిరేశాడు. అంతలోనే అది పేలిపోయింది. యువకుడు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో తోటి రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories