Exam Tension Relief Tips: ఎగ్జామ్ టెన్షన్ తగ్గించే 7 పవర్‌ఫుల్ టిప్స్ ఇవే


Exam Tension Relief: ఎగ్జామ్ టెన్షన్ తగ్గించే 7 పవర్‌ఫుల్ టిప్స్ ఇవే
Exam Tension Relief Tips: ఇంటర్, పదో తరగతి పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించాలంటే నిపుణులు సూచించిన 7 ముఖ్యమైన టిప్స్ తెలుసుకోండి. స్ట్రెస్ ఫ్రీగా ఎగ్జామ్స్ రాయండి.
Exam Tension Relief: రాష్ట్రంలో పరీక్షల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోంది. రేపటి నుంచి ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానుండగా, త్వరలోనే తెలంగాణ ఇంటర్ మరియు పదో తరగతి బోర్డు పరీక్షలు కూడా మొదలుకానున్నాయి. ఈ సమయంలో ఫస్ట్ ర్యాంకర్ నుంచి సాధారణ విద్యార్థి వరకు ప్రతి ఒక్కరూ పరీక్షల టెన్షన్‌కు గురవుతుంటారు.
నిపుణుల ప్రకారం పరీక్షల సమయంలో సరైన ప్రణాళిక, ఆహారపు అలవాట్లు, మానసిక ప్రశాంతత ఎంతో కీలకం. పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి ఏడు ముఖ్యమైన చిట్కాలను సూచిస్తున్నారు.
1. సమతుల్య ఆహారం తీసుకోవాలి: పరీక్షల సమయంలో భోజనం మానేయడం తప్పు. సమయానికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జంక్ ఫుడ్‌ను నివారించాలి.
2. స్టడీ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి: చివరి నిమిషంలో కొత్త పాఠాలు మొదలుపెట్టకుండా ఇప్పటికే చదివిన విషయాలను రివైజ్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
3. మెడిటేషన్, శ్వాస వ్యాయామాలు చేయాలి: రోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. తగినంత నీరు తాగడం కూడా అవసరం.
4. సరైన నిద్ర అవసరం: కనీసం 7 గంటల నిద్ర తీసుకోవడం ద్వారా మెదడు శక్తి పెరుగుతుంది. రాత్రిపూట నిద్ర లేకుండా చదవడం వల్ల ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
5. సమర్థవంతమైన ప్రణాళిక: రోజువారీ చదువుకు సమయాన్ని కేటాయించి, ప్రతి సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలి. పరీక్ష తేదీలను ముందుగానే గుర్తుంచుకోవాలి.
6. గ్రూప్ స్టడీస్: స్నేహితులతో చర్చించడం ద్వారా విషయాలపై అవగాహన పెరుగుతుంది. ఇతరులకు చెప్పడం వల్ల గుర్తింపు మెరుగుపడుతుంది.
7. విరామం తప్పనిసరి: నిరంతరం చదవకుండా ప్రతి అరగంటకు ఐదు నిమిషాల విరామం తీసుకోవాలి. ఇది మెదడుకు రీఫ్రెష్‌మెంట్ ఇస్తుంది.
పరీక్షలకు ముందు అవసరమైన పత్రాలు, సామగ్రి సిద్ధంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవడం వల్ల అదనపు ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, పాజిటివ్‌గా ఆలోచించడం ద్వారా పరీక్షల ఒత్తిడిని జయించవచ్చని చెబుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



