Top
logo

Bodhan: కమలాపుర్ మాజీ సర్పంచ్ రమణ రెడ్డి దారుణ హత్య

Bodhan: కమలాపుర్ మాజీ సర్పంచ్ రమణ రెడ్డి దారుణ హత్య
X
Highlights

మండల కేంద్రంలోని తడ్గాం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కమలాపూర్ మాజీ సర్పంచ్ రమణారెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అతని నివాసం వద్దే చోటుచేసుకుంది.

నవిపేట్: మండల కేంద్రంలోని తడ్గాం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కమలాపూర్ మాజీ సర్పంచ్ రమణారెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అతని నివాసం వద్దే చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నవీపేట మండలం తడ్గం గ్రామంలో కమలాపూర్ మాజీ సర్పంచ్ రమణారెడ్డి నివాసముంటున్నారు. శివరాత్రి పండుగ కావడంతో అందరూ ఆలయాలకు వెళ్లారు.

ఎవరూ లేని సమయంలో పలువురు దుండగులు రమణారెడ్డి గొంతుకోసి అతి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్య చేసిన నిందితులకు పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు.


Web TitleEX Sarpanch Ramana Reddy Murdered in Nizamabad
Next Story