బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్

బీజేపీలో చేరిన  మాజీ ఎంపీ వివేక్
x
Highlights

మాజీ ఎంపీ సీనియర్ నేత గడ్డం వివేక్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జెపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీ కండువా...

మాజీ ఎంపీ సీనియర్ నేత గడ్డం వివేక్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జెపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటి కానున్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌ను వీడిన అనంతరం గతంలో ఓ సారి అమిత్‌షాను కలిసి చర్చించారు. వివేక్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు .స్వయంగా చర్చలు కూడా జరిపారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ రాకపోవడంతో... ఆ పార్టీకి రాజీనామా చేశారు వివేక్. ఇక అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరతారనే అంశంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. అయితే దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతుండటం... తెలంగాణపై కూడా బీజేపీ పెద్దలు ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో వివేక్ నేడు బీజేపీలో చేరారు. అంతకుముందు బీజేపీ ముఖ్యనేత రాంమాధవ్, తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి,ధర్మపురి అరవింద్, లక్ష్మణ్‌లతో సమావేశమయ్యారు వివేక్.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories