Top
logo

నయీం కేసులో వెలుగు చూస్తున్న వాస్తవాలు.... లిస్ట్‌లో ఖాకీలు, పొలిటికల్ లీడర్లు

నయీం కేసులో వెలుగు చూస్తున్న వాస్తవాలు.... లిస్ట్‌లో ఖాకీలు, పొలిటికల్ లీడర్లు
X
Highlights

నయీం కేసులో ఒక్కో వాస్తవం ఒక్కో రకంగా వెలుగు చూస్తోంది. ఈ కేసులో వ్యవహారంలో వివరాలు ఇవ్వాలంటూ ఫోరం ఫర్ గుడ్...

నయీం కేసులో ఒక్కో వాస్తవం ఒక్కో రకంగా వెలుగు చూస్తోంది. ఈ కేసులో వ్యవహారంలో వివరాలు ఇవ్వాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించింది. ఈ కేసులో పలువురు టీఆర్ఎస్ నేతలతో పాటు పోలీస్ అధికారులతో నయీంకు సంబంధాలు ఉన్నట్టు తేలింది. మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పేరు కూడా ఈ జాబితాలో ఉంది. అలాగే అడిషనల్‌ ఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, అమరేందర్‌రెడ్డి పేర్లు, డీఎస్పీలు శ్రీనివాస్‌, సాయిమనోహర్‌రావు, శ్రీనివాసరావు, ప్రకాశ్‌రావు, వెంకటనర్సయ్య పేర్లు ఉన్నాయి.

ఈ కేసులో పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న పేరు కూడా ఉండటం సంచలనం రేపుతోంది. టీఆర్ఎస్‌ నేతలు భువనగిరి కౌన్సిలర్‌ అబ్దుల్‌ నాజర్‌, మాజీ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, మాజీ జడ్పీటీసీ సుధాకర్, మాజీ ఎంపీపీలు నాగరాజు, వెంకటేశ్‌.. మాజీ సర్పంచ్‌ పింగల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవ, వెల్దండ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఈశ్వరయ్య పేర్లున్నాయి.

Next Story