Telangana Martyrs Memorial: అమరుల స్మారక చిహ్నం ప్రారంభానికి సర్వం సిద్ధం.. కాసేపట్లో అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ

Everything Is Ready For The Inauguration Of The Memorial Of The Telangana Martyrs
x

Telangana Martyrs: అమరుల స్మారక చిహ్నం ప్రారంభానికి సర్వం సిద్ధం.. కాసేపట్లో అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ 

Highlights

Telangana Martyrs: సాయంత్రం 6 గంటలకు అమరుల జ్యోతి వెలిగించనున్న సీఎం

Telangana Martyrs: అమరుల స్మారక చిహ్నం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఈ ర్యాలీలో మంత్రులు కూడా పాల్గొననున్నారు. దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు సీఎం కేసీఆర్‌ అమరుల జ్యోతి వెలిగించనున్నారు. అమరులకు గన్ సెల్యూట్ చేసిన అనంతరం సీఎం ప్రసంగించనున్నారు. ఇక సీఎం ప్రసంగం తర్వాత డ్రోన్‌ ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 750 డ్రోన్లను ప్రదర్శన కోసం సిద్ధం చేశారు. ఈ డ్రోన్ ప్రదర్శన ద్వారా అమరులకు నివాళి అర్పించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories