BRS: అధికార పార్టీలో చేరినా.. తప్పని ఓటమి

Even if he joins the ruling party defeat is inevitable now
x

BRS: అధికార పార్టీలో చేరినా.. తప్పని ఓటమి 

Highlights

BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు.

BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. గతంలో కొంతమంది అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలో చేరి విజయం సాధించిన వారు వున్నారు.. కానీ ఈసారి ఎన్నికల్లో వారికి ప్రజలు అధికారమివ్వలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారామని నేతలు చెప్పినా ప్రజలు వారిని నమ్మలేదు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి గెలుపొందిన వనమా వెంకటేశ్వర్‌రావు (Congress), సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య (TDP), పినపాకలో రేగా కాంతారావు (Congress), ఇల్లెందులో హరిప్రియ నాయక్ (Congress), నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య (Congress), భూపాలపల్లిలో గండ్ర వెంకట రమణారెడ్డి (Congress), అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వర్ రావు (TDP), పాలేరులో ఉపేందర్ రెడ్డి (Congress), ఎల్లారెడ్డిలో సురేందర్ (Congress), కొల్లాపూర్‌లో హర్షవర్ధన్‌ రెడ్డి (Congress), తాండూరులో పైలెట్‌ రోహిత్‌ రెడ్డి (Congress) విజయం సాధించగా. ఆ తర్వాత కొద్ది కాలానికే కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చి బీఆర్‌ఎస్‌ పార్టీ లో చేరగా. ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి నిరాశే మిగిలింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి 2018లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలుపొంది.. తరవాత బీఆర్‌ఎస్‌ లో చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories