Top
logo

Etela Wife Jamuna: తమపై ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదు: ఈటల జమున

Etela Wife Jamuna Challenge to Officials Over Devaryamjal Land
X

Etela Jamuna:(File Image)

Highlights

Etela Wife Jamuna: తమపై ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున అన్నారు.

Etela Wife Jamuna: ఇక రాజకీయం రాజేంద్రుడు...భూవ్యవహారం జమునమ్మ పంచుకున్నట్లుంది. భూముల వ్యవహారంలో అధికారికంగా జమున పేరే ఉంది. ఇప్పటిదాకా ఈటల రాజేందర్ ఆరోపణలకు సమాధానం చెబుతూ వచ్చారు. ఇప్పుడాయన రాజకీయంగా బిజీ అయిపోయారు.. అందుకే హైకోర్టులో పిటిషన్లకే పరిమితమైన ఆయన భార్య జమున ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు.

తమపై ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున అన్నారు. తమ హెచరీస్, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియాలో సమావేశంలో జమున మాట్లాడారు. ఈ సందర్భంగా తమపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. అసత్య ప్రచారాలను తిప్పికొట్టడం ఎలాగో తమకు తెలుసునని వ్యాఖ్యానించారు.

మెదక్‌ జిల్లా మాసాయిపేటలో 46 ఎకరాలు కొనుగోలు చేశాం. కానీ మేము బడుగు బలహీనవర్గాల భూమి కాజేశామని దుష్ప్రచారం చేస్తున్నారు. 1992లో దేవరయాంజల్‌ వచ్చి 1994లో అక్కడి భూములు కొన్నాం. దేవుడి భూమి అయితే బ్యాంకులు ఎలా అప్పు ఇచ్చాయి?. 46 ఎకరాల కన్నా ఒక్క ఎకరం భూమి ఎక్కువగా ఉన్నట్టు నిరూపిస్తే ముక్కు నెలకు రాస్తా.. లేకుంటే అధికారులు ముక్కు నేలకు రాస్తారా?'అని జమన సవాలు విసిరారు.

తమ స్థలంలో ఏర్పాటు చేసిన పత్రికలోనే దుష్ప్రచారం చేయడం బాధాకరమని జమున అన్నారు. పత్రిక ఉందని ఎలా పడితే అలా రాస్తారా మండిపడ్డారు. నిజాలు ఎప్పటికైనా బయటపడతాయని అన్నారు. 'దేవరయాంజల్‌లో గోదాం ఖాళీ చేయించాలని మాపై ఒత్తిడి తెచ్చారు. గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవలేవు. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదు' అని జమున అన్నారు.

Web TitleEtela Wife Jamuna Challenge to Officials Over Devaryamjal Land
Next Story