Etela Rajender: రాజాసింగ్‌తో ఈటల కీలక భేటీ..

Etela Rajender Meet Raja Singh
x

Etela Rajender: రాజాసింగ్‌తో ఈటల కీలక భేటీ..

Highlights

Etela Rajender: గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నేతలు.. కార్పొరేటర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారన్న రాజాసింగ్

Etela Rajender: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో బీజేపీ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై, కార్పొరేటర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారని ఈటల దృష్టికి తీసుకెళ్లారు రాజాసింగ్. బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు.

కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని.. బీజేపీ నేతలపై నమోదైన కేసులపై పోలీసు అధికారులతో మాట్లాడతానన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందన్న ఈటల రాజేందర్.. సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories