logo
తెలంగాణ

Etela Rajender: నేడు బీజేపీ కండువా కప్పుకోనున్న ఈటల రాజేందర్

Etela Rajender Going to be Join in BJP Today
X

ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Etela Rajender: ఉదయం 11.30 గంటలకు బీజేపీలో చేరనున్న ఈటల * జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న ఈటల

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, మరికొంత మందితో పాటు కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఉదయం 5 గంటలకు శామీర్​పేట్​లోని ఆయన నివాసం నుంచి బయలుదేరిన ఈటల.. 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తన అనుచరులతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. అయితే కొవిడ్‌ దృష్ట్యా 20 మంది ముఖ్య నేతలకు మాత్రమే పార్టీ కేంద్ర కార్యాలయంలో అనుమతి ఉంటుందని బీజేపీ ముఖ్యనేతలు తెలిపారు.

ఇటీవల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన ఈటల ఇక హుజూరాబాద్‌లో రాజకీయ కురుక్షుత్రమే అని ప్రకటించారు. హుజురాబాద్‌ ఉపఎన్నికలో డబ్బు సంచులకు, ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరగబోతోందని అన్నారు. తన ఎజెండా లెఫ్ట్‌, రైట్‌కాదని యావత్‌ తెలంగాణ ప్రజానీకం అనుభవిస్తోన్న ఫ్యూడల్‌ నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమే లక్ష్యమని ప్రకటించారు.

ఇవాళ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజేందర్ సహా ఇతర నేతలు కాషాయ కండువా కప్పుకుంటారు. అనంతరం అందరూ కలిసి బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశం అవుతారు. కాగా, తనతో కలిసి వస్తున్న నేతలతోపాటు బీజేపీ నాయకులను ఢిల్లీ తీసుకెళ్లేందుకు ఈటల రాజేందర్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. పార్టీలో చేరిన అనంతరం రేపు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. పార్టీలో చేరిక కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొంటారు.

Web TitleEtela Rajender Going to be Join in BJP Today
Next Story