logo
తెలంగాణ

Etela Rajender: టీఆర్ఎస్ నేతలు వెకిలి చేష్టలు మానుకోవాలి- ఈటల

Etela Rajender Fire on TRS Leaders
X

ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Etela Rajender: కేసీఆర్ కనుసన్నల్లో అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈటల రాజేందర్.

Etela Rajender: కేసీఆర్ కనుసన్నల్లో అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈటల రాజేందర్. తన అనుచరులను, ఏనుగు రవీందర్‌రెడ్డిని అసెంబ్లీలోకి అనుమతివ్వకపోవడంపై మండిపడ్డ ఆయన.. రాష్ట్రంలో నడుస్తోన్న ఫ్లూడలిజానికి నిదర్శనమన్నారు.

ప్రగతిభవన్‌ నుంచి రాసిచ్చిన స్క్రిప్టులను టీఆర్‌ఎస్‌ నేతలతో చదివించి తనపై సంధిస్తున్నారన్న ఈటల.. ఈ వెకిలి చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. లేదంటే మీకే ఎదురు దెబ్బ తగులుతుందంటూ సీఎంను హెచ్చరించారు. రెండున్నరేళ్లుగా పింఛన్లు రాకున్నా పట్టించుకోని సీఎం.. ఉప ఎన్నిక కోసం ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు ఈటల రాజేందర్. కేసీఆర్ ప్రలోభాలను తిప్పికొడతామని తెలిపారు.

ప్రస్తుతం కొద్ది మందితో మాత్రమే ఢిల్లీ్కి వెళ్తామన్న ఈటల.. రాబోయే రోజుల్లో ఇతర నేతల్ని కలుపుకొని పోతానని స్పష్టం చేశారు. చాలా మంది తమతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. ఉద్యమకారులతో తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటానికి శ్రీకారం చుడతామన్నారు.

Web TitleEtela Rajender Fire on TRS Leaders
Next Story