Etela Rajender: బిజెపి అధికారంలోకి వస్తే సింగరేణి గనులకు పూర్వ వైభవం

Etela Rajender Comments On BRS
x

Etela Rajender: బిజెపి అధికారంలోకి వస్తే సింగరేణి గనులకు పూర్వ వైభవం

Highlights

Etela Rajender: సింగరేణిగణులను బిఆర్ఎస్ నాయకుదోచుకునే ప్రయత్నం

Etela Rajender: సాధించుకున్న తెలంగాణలో లాభాల్లో ఉన్న సింగరేణిగనులను నష్టాల పాల్జేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. ఖమ్మంలో రైతు సభకు జనసమీకరణలో భాగంగా సింగరేణి కార్మికులతో ఆయన కాసేపు ముచ్చటించారు. లక్షా 20వేల మంది కార్మికులతో కళకళలాడిన సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణిలో ప్రైవేటీకరణ జాఢ్యం పెరిగిపోతోందని, బిఆర్ఎస్ నాయకులు సింగరేణిని దోచుకుంటున్నారని ఆరోపించారు. భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వస్తే... సింగరేణి గనులకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories