డయాలసిస్‌ పేషెంట్‌ ఉన్న కుటుంబం ఎంత నరకం అనుభవిస్తుందో: మంత్రి ఈటల రాజేందర్

డయాలసిస్‌ పేషెంట్‌ ఉన్న కుటుంబం ఎంత నరకం అనుభవిస్తుందో: మంత్రి ఈటల రాజేందర్
x
Etela Rajender (File Photo)
Highlights

రెండు రోజుల విరామం తురావాత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు పున:ప్రారంభం అయ్యారు. ఈ రోజు జరిగిన శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమావేశాలకు అధ్యక్షత వహించారు.

రెండు రోజుల విరామం తురావాత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు పున:ప్రారంభం అయ్యారు. ఈ రోజు జరిగిన శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఉభయ సభల్లో ప్రవ్నోత్తరాల సమయంలో నర్సిరెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాల గురించి సభలో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 40 ఆస్పత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. వాటిలో ఒక్కో సెంటర్ కు దాదాపుగా ఐదు నుంచి పది డయాలసిస్ మిషన్లనే అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 10 వేల మంది డయాలసిస్‌ పేషెంట్లు ఉన్నారన్న సమాచారం ఉందన్నారు. ప్రభుత్వం వారిలో ఒక్కొక్క రోగి మీద ఏడాదికి ఒక లక్ష 80 వేల రూపాయలు ఖర్చుచేస్తుందని స్పష్టం చేసారు. అంత కంటే ఎక్కువ ఖర్చు అయినప్పటికీ ప్రభుత్వమే భరిస్తుందని, పేదలకు ఉచిత వైద్యం అందిస్తుందని తెలిపారు. రాస్ట్రంలో డయాలసిస్ రోగుల తాకిడి ఎక్కువయితే వారిని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరికొన్ని డయాలసిస్‌ సెంటర్లు, అదనపు మిషన్లు, వాటిని ఆపరేట్‌ చేసే సిబ్బందిని నియమిస్తామని మంత్రి పేర్కొన్నారు. రోగుల పరిస్థితిన దృష్ట్యా 24 గంటల వైద్య సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఆస్పత్రికి వచ్చిన ఏ ఒక్క రోడి కూడా ఇబ్బంది పడకుండా వైద్యం అందించే పద్దతిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఒక కుటుంబంలో డయాలసిస్‌ పేషెంట్‌ ఉంటే ఆ కుటుంబంలో ఎంత నరకం అనుభవిస్తుందో మాకు తెలుసన్నారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కిడ్నీ పేషెంట్లకు ఏం ఇబ్బంది లేకుండా చూసుకునే జిమ్మేదార్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని ఆయన అన్నారు. అనంతరం కంటి వెలుగు పథకం గురించి మాట్లాడుతూ ఈ పథకంలో సుమారుగా ఇప్పటి వరకు 40 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories