రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి : మంత్రి ఈటల

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి : మంత్రి ఈటల
x
Highlights

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ రోజు (శుక్రవారం) ఏప్రిల్ 24న రాష్ట్రంలో 13 కేసులు నమోదు అయ్యాయని అన్నారు. గురువారం మరో 29 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు మంత్రి ఈటల తెలిపారు. ఇక ఇప్పటికే 262 మంది డిశ్చార్జ్ అయినట్లు ఈటెల స్పష్టం చేశారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 983కి చేరుకుందని అన్నారు.

ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో కరోనాతో 663 మంది చికిత్స పొందుతున్నట్లు ఈటల వెల్లడించారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ కట్టుదిట్టం చేశామని మంత్రి వెల్లడించారు. ఇక కరోనాపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నారని అన్నారు. ఇక కరోనాని మరింతగా కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మే 07 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories