Revanth Reddy: హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ ఏర్పాటు

Establishment of Artificial Intelligence Center in Hyderabad
x

Revanth Reddy: హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ ఏర్పాటు 

Highlights

Revanth Reddy: హైదరాబాద్‌లో AI సెంటర్‌ను నెలకొల్పేందుకు సిద్ధం

Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యంగా.. అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీతో చర్చలు జరిపారు. త్వరలోనే ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్‌లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో ట్రైజిన్ కంపెనీ అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది.

రాబోయే మూడేండ్లలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను అందిస్తుంది. ఈ కంపెనీ మొత్తం ఆదాయం 160 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో పని చేస్తున్న 2 వేల 500 మందిలో వెయ్యి మంది మన దేశంలో ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 100 మంది ఉన్నారు. మరో ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories