ESI Scam : ఈఎస్ఐ స్కామ్ లో దేవికారాణి ఆస్తుల చిట్టా రిలీజ్

ESI Scam : ఈఎస్ఐ స్కామ్ లో దేవికారాణి ఆస్తుల చిట్టా రిలీజ్
x
దేవికారాణి
Highlights

ఈఎస్ఐ స్కామ్ లో దేవికారాణి ఆస్తుల చిట్టాను ఏసీబీ రిలీజ్ చేసింది. వంద కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. తెలంగాణ, ఏపీలోనూ భారీగా...

ఈఎస్ఐ స్కామ్ లో దేవికారాణి ఆస్తుల చిట్టాను ఏసీబీ రిలీజ్ చేసింది. వంద కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. తెలంగాణ, ఏపీలోనూ భారీగా స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ విచారణలో వెల్లడయ్యింది.

దేవికారాణి అక్రమాల్లో సహకరించిన ఆమె భర్త గురుమార్తిని ఏసీబీ అదికారులు అరెస్ట్ చేశారు. నారాయణగూడలోని ఇండియన్ బ్యాంక్ లో 34లక్షల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లు, మరో 23 బ్యాంకుల్లో కోటీ 23 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. 25.72లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, 8.40 లక్షల నగదు, 7లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇన్నోవా కారు, మోటర్ బైక్ సీజ్ చేసిన ఏసీబీ అధికారులు వేర్వేరు చోట్ల రూ.15 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో 100 కోట్లపైగా ఉంటుందని పీఎంజే జ్యువెల్లర్స్ కు రూ.7.3 కోట్లు చెల్లించినట్టు ఏసీబీ గుర్తించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories