TSPSC: టీఎస్‌పీఎస్పీ కేసులో రంగంలోకి దిగిన ఈడీ

Enforcement Directorate Has Registered Case On TSPSP Paper Leak
x

TSPSC: టీఎస్‌పీఎస్పీ కేసులో రంగంలోకి దిగిన ఈడీ

Highlights

TSPSC: ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను విచారించేందుకు అనుమతించాలంటూ పిటిషన్

TSPSC: TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీకేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకుంభకోణంపై హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈసీఆర్ నమోదు చేసింది ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్. సోమవారం ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు అనుమతించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ ఇప్పటి వరకూ 17 మంది నిందితులను అరెస్ట్ చేసింది.

గ్రూప్ వన్ పరీక్షలో వందకుపైగా మార్కులు సాధించిన 121 మందిని, జగిత్యాల జిల్లామల్యాలలో గ్రూప్ వన్ మెయిన్స్‌కు అర్హత సాధించిన 40 మందిని విచారించింది. టీఎస్‌పీఎస్పీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డితో సహా కీలక వ్యక్తుల వాంగ్మూలాలను సేకరించింది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ ముందుగానే అందుకుని విదేశాల నుంచి వచ్చి పరీక్ష రాసిన వారు ఉండటం, మనీలాండరింగ్ కోణం ఉండటంతో ఈడీ రంగంలోకి దిగింది. సిట్ సాక్షిగా పేర్కొన్న శంకర్ లక్మిపై ఈడీ ప్రధాన దృష్టి సారించినట్టు తెలుస్తోంది, కాన్ఫడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ గా ఉన్న ఆమె కంప్యూటర్ నుంచే ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి.

శంకర్ లక్మితోపాటు TSPSC కి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బుద,గురువారాల్లో తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. వారిని విచారించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటుంది. సిట్ నిర్వహించిన దర్యాప్తులో సేకరించిన వివరాలు, నమోదు చేసిన వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ నివేదిక ఇలా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు తీసుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories