సిరిసిల్ల టెక్ట్స్‌టైల్ పార్క్‌లో కార్మికులకు తగ్గుతున్న ఉపాధి
8 ఏళ్లలో బలహీన పడిన సిరిసిల్ల టెక్ట్స్‌టైల్ పార్క్
అగ్గిపెట్టెలో చీరను నేసిన నేల అది.. కానీ.. ఇప్పుడు ఆధారానికి కూడా నోచుకోలేకపోతోంది. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్.. సరిగ్గా 20 ఏళ్ల క్రితం నాటి ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. స్దానికంగా ఉపాధి కల్పించడంతో పాటుగా కొత్తవారికి నైపుణ్యం పెంచేందుకు ప్రయత్నాలు చేశారు. మరి ఈ 20 ఏళ్లలో సిరిసిల్ల టెక్ట్స్‌టైల్ పార్క్ ఏం అభివృద్ధిని సాధించింది. ఎంతమంది నేత కార్మికులకు ఉపాధిగా దొరికింది..? అసలు టెక్ట్స్‌టైల్ పార్క్ మనుగడ ప్రస్తుతం ఎలా ఉంది..?
సిరిసిల్ల నేత కార్మికుల ఉపాధి కోసం 2003లో నిర్మించిన టెక్ట్స్‌టైల్ పార్క్ కాలం గడిచిన కొద్ది నిర్వీర్యమవుతూ వస్తోంది. ఎంతో అట్టహాసంగా మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ ప్రాంతం ప్రభుత్వాలు మారుతున్న కొద్ది నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. ఓ దశలో స్దానికంగా ఉపాధి లేకపోగా ఇక్కడికి వచ్చిన వ్యాపారులు తీవ్ర నష్టాలతో మునిగిపోతున్నారు. దీంతో సిరిసిల్ల టెక్ట్స్‌టైల్ పార్క్ లో ఉన్న పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. సుమారు ఏడు వేల మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన టెక్ట్స్‌టైల్ పార్క్‌లో మొత్తం 235 యూనిట్స్‌ని నడిపించే సామర్ద్యం ఉంది. మొదటి నుంచి 200 యూనిట్స్ వరకు పని జరిపించారు. ఇప్పుడు వాటి సంఖ్య మూడో వంతుకి పడిపోయింది. 7 వేల మందికి ఉపాధి కల్పలించాలి అనుకున్నారు నాటి పాలకులు.. కానీ అది 20 ఏళ్లు గడిచేసరికి వందల్లోకి పడిపోయింది. ప్రస్తుతం ఇక్కడ పదుల సంఖ్యలో యూనిట్స్ నడుస్తూండగా.., వందల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు.
బతుకులు ఆరిపోయి నిర్జీవంగా ఉన్న నేతన్నలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 2003లో సుమారుగా 80 ఎకరాల్లో ఈ పార్క్‌ని నిర్మించారు. ఇక్కడికి వచ్చే వ్యాపారులకు ప్రభుత్వం నుండి విద్యుత్ సబ్సిడి సహా ఇతర అవసరాలను తీర్చేందుకు నాటి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇక్కడ ఉత్పత్తి చేసే పాలిస్టర్ క్లాత్‌కి గతంలో అత్యంత డిమాండ్ కూడా ఉండేది. కానీ ప్రభుత్వాలు మారుతున్న కొద్ది నిబంధనలు మారిపోయాయి. నాయకులు, ఎప్పటికప్పుడు మారటంతో.. ఈ టెక్ట్ష్స్‌టైల్ పార్క్‌పై నిర్లక్ష్యపు నీడలు ఆవరించాయి. విద్యుత్ సబ్సిడిల్లో తేడాలు రావడం.. కొత్తగా వచ్చే వ్యాపారులకు సరైన ప్రోత్సహాం లభించకపోవడం లాంటి కారణాలతో పాటు.. ఇక్కడ ఉత్పత్తి చేసిన క్లాత్‌కి డిమాండ్ పడిపోవడంతో అనేక యూనిట్స్ పూర్తిగా మూతపడ్డాయి. ఇక మరమగ్గాలు తుప్పుపట్టిపోవడంతో వాటిని తుక్కుకి అమ్మేసుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. అయితే తెలంగాణ వచ్చిన తరువాత బతుకమ్మ.. రాజీవ్ విద్యామిషన్ స్కూల్ యూనిఫామ్స్ లాంటి ఆర్దర్లు ఇవ్వడంతో ప్రస్తుతం వాటిపై ఆధారపడి సిరిసిల్ల నేతకార్మికుల మగ్గాలు బతుకులు ఈడ్చుకొస్తున్నాయి.
గత పదేళ్లుగా ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ... RVM లాంటి ఆర్డర్లతో ఏడాదిలో సగం రోజులకే పని దొరుకుతున్నప్పటికీ.. సిరిసిల్ల బ్రాండ్ ని మార్కెటింగ్ చేయడంలో గత ప్రభుత్వం మాత్రం పూర్తిగా విఫలం చెందిందని అక్కడి వాళ్లు చెబుతున్నారు. ఇక ఆధునిక మగ్గాలను సిరిసిల్లలో ప్రోత్సహించడం లాంటివి కూడా చేయలేదు. ఈ కారణాలతో సిరిసిల్లలో నేటి ఫ్యాషన్‌కి తగ్గట్టుగా.. నేటి డిమాండ్‌కి సరిపడా క్లాత్ ఉత్పత్తి జరగడం లేదు. తమిళనాడులోనూ సిరిసిల్ల తరహా టెక్స్ టైల్ ఇండస్ట్రీ ఉంది...ఒకనాడు పోటాపోటిగా కనిపించిన ఈ రంగంలో ఇప్పుడు తమిళనాడు అగ్రశ్రేణిలో ఉంది. కారణం అక్కడ కాలానికి అనుగుణంగా నేతకార్మికులను.. అక్కడి వ్యాపారులను ప్రభుత్వాలు ప్రోత్సహించి అటువైపుగా పురోగతిని సాధించాయి. కానీ సిరిసిల్లలో అలాంటి పరిణామాలు గత కొన్నేళ్లుగా సాగకపోవడంతో సిరిసిల్ల నేతకార్మికుల నైపుణ్యత కేవలం బతుకమ్మ చీరలు, ప్రభుత్వ పాఠశాల యూనిఫాంల వరకే ఆగిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల టైక్ట్స్‌టైల్ రంగాలతో పోలీస్తే.. తెలంగాణ చాలా వెనకబడి ఉందని.. మార్కేట్ డిమాండ్‌ని బట్టి చూస్తే తెలిసిపోతుంది. అయితే సిరిసిల్ల లాంటి నేతకార్మికుల అడ్డాలో నైపుణ్యత పెంచేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేయకపోవడం కూడా ఇందుకు ప్రధానకారణంగా చెప్పొచ్చు. అగ్గిపెట్టేలో పట్టే చీరను నేసిన సిరిసిల్ల నేతన్నలు ప్రపంచం కోరుకుంటున్నట్టుగా డిమాండ్ ఉన్న వస్త్రాలను తయారు చేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ అదే స్దాయిలో పనిచేసే అధునాతన మగ్గాలు ఇక్కడ అంతగా అందుబాటు లేవు. కొంత మంది వ్యాపారులు వాటిని కొనుగోలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రోత్సహాం లేకపోవడంతో ఇతర వ్యాపారులు అటువైపు అడుగులు వేయలేకపోతున్నారు. 10 ఏళ్ల కాలంలో అద్భుతంగా చేశామని చెప్పుకున్న నేతలు ప్రచార ఆర్బాటలకే సిరిసిల్లని పరిమితం చేశారన్న మాట ఇక్కడి పరిస్దితిని చూస్తే అర్దం అవుతోంది. మరి స్వరాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల నేతకార్మికులను అభివృద్ధి చేస్తుందా..? అన్నది వేచి చూడాలి.
నిజానికి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సిరిసిల్ల నేతకార్మికులను ఓ రాజకీయ అస్త్రంగానే అన్ని పార్టీలకు వినియోగించుకుని ఓట్లు దండుకుంటున్నాయి. సిరిసిల్లలో ఏం జరిగినా..,అది రాజకీయంగా మారుతుంది తప్పా... నేత కార్మికుల జీవితాల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వాలు మారినా.. నాయకులు మారినా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు రోజురోజుకు పరిస్థితి దిగజారుతోంది. కనీసం ఈ ప్రభుత్వమైనా సిరిసిల్ల నేతకార్మికులకు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను కొనసాగిస్తుందా... వేచి చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire