నిత్యావసర, అత్యవసర సేవలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు: ఎస్పీ

నిత్యావసర, అత్యవసర సేవలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు: ఎస్పీ
x
Highlights

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర, అత్యవసర సేవలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.

మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర, అత్యవసర సేవలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ... నిత్యావసర సరకులు, వైద్య, వ్యవసాయ రంగాలకు సంబంధించిన వాహనాలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలు లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులకు చక్కటి సహకారం అందిస్తున్నారని అన్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ మీడియా సంస్థలకు సంబంధించిన వాహనాలకు ప్రత్యేక పాస్‌లు జారీ చేసినట్లు చెప్పారు. గుర్తింపు కార్డులకు సంబంధించి 7901151915 కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవాలని అన్నారు. అత్యంత సున్నితమైన ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తింపు కార్డులు చాలా విలువైనవిగా భావించాలని చెప్పారు. ఇందులో ఎవరైన పొరపాట్లకు తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎవరైనా వస్తే వారి వివరాలను 94946 00100కు తెలియజేయాలని కోరారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories