Electricity Production : వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి

Electricity Production : వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి
x
Highlights

Electricity Production : హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు వెలువడే చెత్తను ఉపయోగించి శాస్త్రీయ పద్ధతుల్లో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు గాను రాంకీ సంస్థ...

Electricity Production : హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు వెలువడే చెత్తను ఉపయోగించి శాస్త్రీయ పద్ధతుల్లో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు గాను రాంకీ సంస్థ 2009లో జీహెచ్‌ఎంసీతో 25 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రోజులు 19.8 మెగావాట్ల విద్యుత్‌ను చెత్తను వినియోగించి ఉత్పత్తి చేయాల్సి ఉంది. అయితే ప్లాంట్‌లో ఉండే రెండు బ్రాయిలర్ లకు గాను ఒక బ్రాయిలర్ మాత్రమే ప్రస్తుతం వినియోగంలోకి రావడంతో కేవలం 10 మెగావాట్ల విద్యుత్‌ ను మాత్రమే ఉత్పతి చేస్తున్నారు. రెండో బాయిలర్‌కూడా వినియోగంలోకి వస్తే 19.8 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. ఉత్పత్తి అయిన విద్యుత్తును ప్రభుత్వ విద్యుత్‌పంపిణీ సంస్థకు నిర్ధారిత ధరకు సరఫరా చేస్తోంది.

ఈ విధంగా చెత్తను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడాన్ని ఇంటిగ్రేటెడ్‌ మునిసిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎంఎస్‌డబ్లు్యఎం) ప్రాజెక్ట్‌ అని అంటారు. దీనిద్వారా రోజుకు 1000 నుంచి 1200 మెట్రిక్‌టన్నుల ఆర్డీఎఫ్‌ చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. రెండు దశలుగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే రెండు దశలు పూర్తయితే జవహర్‌నగర్‌కు తరలిస్తున్న చెత్తనుంచి 48 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో రెండు ప్లాంట్లను 19.8 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యంతో ఏర్పాటు చేశారు. ఇక రెండో దశలో మరో 28.2 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కూడా చర్యలు చేపట్టారు.

ఇక ఈ విధంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తే జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డులో చెత్త పరిమాణం తగ్గుతుందని జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ రాహుల్‌ రాజ్ అన్నారు. అంతే కాదు విద్యుత్తు ఉత్పత్తి కావడం వలన ఆర్థికంగా కూడా ప్రయోజనమే. ఇందులో భాగంగానే నగర శివార్లలో మరికొన్ని చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటుచేస్తామని అధికారులు తెలిపారు. విద్యుత్ తో పాటు చెత్తను అక్కడే కంపోస్టు ఎరువుగా మార్చేందుకు సర్కిళ్ల స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories