Nirmal: ఖానాపూర్‌లో విషాదం.. గణేశ్ నిమజ్జన ర్యాలీలో చిన్నారులకు విద్యుత్ షాక్

Electric Shock to Children in Ganesh Immersion Rally
x

Nirmal: ఖానాపూర్‌లో విషాదం.. గణేశ్ నిమజ్జన ర్యాలీలో చిన్నారులకు విద్యుత్ షాక్

Highlights

Nirmal: ట్రాక్టర్‌లో వినాయకుడిని తరలిస్తుండగా తగిలిని కరెంట్ వైర్లు

Nirmal: నిర్మల్ జిల్లా ఖానాఫూర్ పట్టణంలోని సుభాష్‌నగర్‌లో విషాదం జరిగింది. గణేష్ నవరాత్రుల సందర్భంగా చేపట్టిన నిమజ్జన ర్యాలీలో ముగ్గురు చిన్నారులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. గణపతి విగ్రహం ట్రాక్టర్‌లో తరలిస్తుండగా చిన్నారులు అదే సమయంలో ట్రాక్టర్‌లో ఉన్నారు. దీంతో విద్యుత్ వైర్లను గమనించని చిన్నారులు ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌తో కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు హుటాహుటిన ముగ్గురినీ నిర్మల్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories