Telangana: పోలిటికల్ హీట్.. నువ్వా నేనా అన్నట్టు దూసుకెళ్తున్న పార్టీలు

Election Heat in Telangana
x

Telangana: పోలిటికల్ హీట్.. నువ్వా నేనా అన్నట్టు దూసుకెళ్తున్న పార్టీలు

Highlights

Telangana: ఎన్నికల ప్రచారంలో పార్టీల జోరు

Telangana: తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగింది. ప్రచారంలో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా దూసుకపోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పని చేస్తున్నాయి. దక్షిణ భారతంలో పట్టు సాధించాలని భావిస్తున్న బీజేపీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మరోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని బీఆర్ఎస్ దూసుకుపోతుంది.

తెలంగాణలో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచార చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు క్యూకడుతున్నారు . ప్రధాని మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డా వరుస పర్యటనలతో కార్యకర్తల్లో జోష్ నింపారు. జాతీయ నేతల పర్యటనలతో బీజేపీ ప్రచారంలో జోరు పెంచింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వేగం పెంచాలని నిర్ణయించుకుంది. అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రచార బరిలోకి దిగుతుంది. ఇప్పటికే రాహుల్, ప్రియాంక గాంధీలు బస్సు యాత్ర నిర్వహించారు. కార్నర్ మీటింగ్‌లు , బహిరంగసభలు విజయవంతం కావడంతో మరిన్ని సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 31న కొల్లాపూర్‌లో ‘పాలమూరు ప్రజాభేరి’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. నవంబర్ మొదటి వారంలో రాహుల్ గాంధీ మరోమారు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాహుల్, ప్రియాంక రెండో విడత బస్సులో యాత్రలో పాల్గొననున్నారు.

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ బాస్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. రోజుకు 3 సభలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తూ.. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ప్రతిరోజూ 3 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ.. తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో గులాబీ బాస్ ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories