నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం

Election Campaign of Mallikarjun Kharge in Medak District Today
x

నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం

Highlights

Mallikarjun Kharge: తారా డిగ్రీ కాలేజీ నుంచి గంజి మైదాన్‌ వరకు ర్యాలీగా వెళ్లనున్న ఖర్గే

Mallikarjun Kharge: కాంగ్రెస్‌ విజయభేరి రెండో విడత బస్సు యాత్రలో భాగంగా ఆదివారం సంగారెడ్డి, మెదక్‌లో జరిగే బహిరంగ సభల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న ఆయన.. నేరుగా సంగారెడ్డికి చేరుకుని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. అక్కడ లంచ్‌ను ముగించుకుని హెలికాప్టర్‌లో మెదక్‌కు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళ్లిపోతారు. ఇక సోమవారం (30న) జనగామ, ఆలేరు, భువనగిరి.. 31న నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో కొనసాగనున్న బస్సు యాత్రలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పాల్గొనే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories