Delhi Liquor Scam: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. నేడు మళ్లీ రావాలని చెప్పిన అధికారులు!

ED Will be investigating the MLC Kavitha once Again Today
x

 Delhi Liquor Scam: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. నేడు మళ్లీ రావాలని చెప్పిన అధికారులు!

Highlights

Delhi Liquor Scam: ఉ.11.30గంటలకు విచారణకు రావాలని ఈడీ నోటీసులు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ మరోసారి ఈడీ విచారించనుంది. ఉదయం 11.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో కవితను అనుమానితురాలిగా అభియోగాలు మోపారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత సౌత్ గ్రూప్ నుంచి కవిత కీలకమైన వ్యక్తిగా ఈడీ భావిస్తోంది. రెండో సారి విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితను పదిన్నర గంటలకు పైగా ఈడీ అధికారులు విచారించారు. PMLA సెక్షన్ 50 కింద... కవితను ప్రశ్నించారు.

నిన్న మొన్నటిదాకా లిక్కర్ కేసుకు సంబంధించి సాక్షిగా పరిగణించిన ఈడీ అధికారులు... తాజాగా నిందితురాలిగా గుర్తించారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా, అరుణ్ రామచంద్ర పిళ్లై, అమిత్ అరోరాలతో కలిపి కవితను ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అభియోగాలు... సాక్ష్యాధారాలను ముందుపెట్టిన ఈడీ అధికారులు కవిత ప్రమేయంపై డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో అందరి సమక్షంలో వాంగ్మూలం స్వీకరించారు. ఎప్పటికప్పుడు ప్రతి అంశంపైనా చర్చించిన ఈడీ అధికారులు స్టేట్ మెంట్ రికార్డు చేసి దస్తావేజులపై సంతకాలు తీసుకున్నారు.

కేసుల్లో మనీ లాండరింగ్ యాక్ట్ లో సెక్షన్ 50 కింద విచారణ జరిపిన ఈడీ అధికారులు, సాక్ష్యాధారాలను ముందుపెట్టి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అభియోగాలు, సాక్ష్యాధారాలను ముందుపెట్టి విచారించే ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరైన వ్యక్తి నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈడీ విచారణలో టెక్నికల్ ఎవిడెన్స్, డిజిటల్ ఎవెడెన్స్, నిందితులతో సత్సంబంధాలు నిరూపణ అయిన తర్వాత... అందరిచేత వాంగ్మూలాలను రికార్డుచేసి... నిందితులను, సాక్ష్యాధారాలను ఈడీకోర్డులో సమర్పిస్తారు. దీంతో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి తక్షణమే బెయిల్ రావడం కష్టమని చెబుతున్నారు.

ఈడీ విచారణలో ముఖ్యంగా పిళ్లైతో ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై కవితను ప్రశ్నించినట్లు సమాచారం. కన్ ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. లిక్కర్ వ్యాపారంతో మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అభియోగాలున్నాయని, ఈ కేసులో మీ పాత్ర లేదని ఎలా చెప్పగలరనే అంశంపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.

మొదటిసారి కవితను విచారించినప్పుడే సాయంత్రం 6 గంటలు దాటితే మహిళను విచారించకూడదని.. అది చట్ట విరుద్ధమని కవిత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే రెండోసారి విచారణలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అసలు ఈడీ కార్యాలయంలో ఏం జరుగుతోంది..? ఏం జరగబోతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. పైగా ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లడంతో... హస్తినలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అలాగే వైద్యుల బృందం ఈడీ కార్యాలయంలోకి వెళ్లడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మరింత పెరిగిపోయింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ గా వినబడుతున్న టీమ్ సభ్యులతో ప్రత్యేకంగా విచారించి నిందితుల అభిప్రాయాలను ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పటిదాకాక అరెస్టయిన సభ్యులతో కలిపి ఎవరి పాత్ర ఏంటనే అంశాలపై అందరి సమక్షంలో టెక్నికల్ ఎవిడెన్స్ తో విచారించబోతున్నారని సమాచారం.

ఈడీ విచారణలో ముఖ్యంగా పిళ్లైతో ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై కవితను ప్రశ్నించినట్లు సమాచారం. కన్ ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. అయితే సాయంత్రం 6 గంటలు దాటినా కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటికి రాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోయింది.

మొదటిసారి కవితను విచారించినప్పుడే సాయంత్రం 6 గంటలు దాటితే మహిళను విచారించకూడదని.. అది చట్ట విరుద్ధమని కవిత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే రెండోసారి విచారణలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అసలు ఈడీ కార్యాలయంలో ఏం జరుగుతోంది..? ఏం జరగబోతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. పైగా ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లడంతో... హస్తినలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అలాగే వైద్యుల బృందం ఈడీ కార్యాలయంలోకి వెళ్లడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మరింత పెరిగిపోయింది.

రెండో సారి విచారణ ముగియడంతో ఎమ్మెల్సీ కవిత నవ్వుతూ విజయసంకేతంతో అభివాదంచేస్తూ కారులో వెళ్లిపోయారు. ఇవాళ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు మరోసారి విచారణకు హాజరు కాబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ ‌గ్రూప్‌గా వినబడుతున్న టీమ్‌ సభ్యులతో ప్రత్యేకంగా విచారించి నిందితుల అభిప్రాయాలను ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories