MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

ED Notices To MLC Kavitha
x

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

Highlights

MLC Kavitha: ఈ నెల 10న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని నోటీసులు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఈ కేసులో ఇప్పటికే అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. తాజాగా ఎమ్మెల్సీ కవిత నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే విచారించారు. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ... ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. ఈ స్కామ్‌లో కవితకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్టులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. లిక్కర్ స్కామ్ లో పిళ్లైను అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్... రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై కవిత బినామీగా ఉన్నారన్న ఈడీ... పిళ్లై కవిత ప్రతినిధి అని అనేక స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు రిపోర్టులో తెలిపింది. కవిత ఆదేశాల మేరకే పిళ్ళై పనిచేశారంది. ఇండో స్పిరిట్ స్థాపనలో అరుణ్ పిళ్ళై కీలకపాత్ర పోషించారని.. కాగితాలపై మూడున్నర కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పిళ్ళై చూపారని తెలిపింది ఈడీ. అందుకు ప్రతిఫలంగా కవిత ఆదేశాలతో అరుణ్ పిళ్ళైకు కోటి రూపాయలు ఇచ్చినట్లు రిపోర్టులో వెల్లడించింది.

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కల్పించాలంటూ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో 10వ తేదీనే విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories