ED: చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

* ఎమ్మెల్సీ ఎల్ రమణతో పాటు మరికొందరికి నోటీసులు...విచారణకు రావాలని ఈడీ ఆదేశాలు

R Tripura Malini
Published on: 17 Nov 2022 11:12 AM IST
ed investigation in chikoti praveen casino case has picked up the pace
X

చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

Enforcement Directorate: చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎల్ రమణతో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేసిన ఈడీ విచారణకు రావాలని ఆదేశించింది. హవాలా కేసులో పలువురిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. చీకోటి కేసు ఈడీ చిట్టాలో పలువురు తెలుగు నేతలు ఉన్నట్లు సమాచారం. ఇక తలసాని సోదరులను 10 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు.

విదేశాల్లో క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీల వంటి అంశాలపై ఆరా తీశారు. ఫెమా యాక్ట్ నిబంధనలు, మనీలాండరింగ్‎పై ఈడీ కూపీ లాగుతోంది. తలసాని మహేష్, తలసాని ధర్మేందర్‌ను ప్రశ్నించిన ఈడీ ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. చీకోటి ప్రవీణ్, మాధవ్‎రెడ్డి కాల్‎డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఫ్లైట్ బుకింగ్స్ వివరాలు సేకరించిన ఈడీ వాటి ఆధారంగా అనుమానితులను విచారణకు పిలుస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story