నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలపై ఎట్టకేలకు తేల్చేసిన ఈసీ

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలపై ఎట్టకేలకు తేల్చేసిన ఈసీ
x
Highlights

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 11న ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్, రాష్ట్ర ఇన్‌చార్జి...

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 11న ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్, రాష్ట్ర ఇన్‌చార్జి ఉమేశ్‌ సిన్హా స్పష్టం చేశారు. రికార్డు స్థాయిలో 185 మంది అభ్య ర్థులు పోటీ చేస్తుండటంతో అక్కడ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనుమానాలకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ఉమేశ్‌ సిన్హా తెరదించారు. నిజామాబాద్‌ ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందంతో కలసి ఉమేశ్‌ సిన్హా సమీక్షించారు. ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడిన సందర్భంలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో ఎన్నికలు నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారన్నారు. రాష్ట్రానికి ఇది మరో మైలురాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఒక కంట్రోల్‌ యూనిట్, 12 బ్యాలెట్‌ యూనిట్లు, ఒక వీవీప్యాట్‌యూనిట్‌ను వాడబోతున్నాం'అని ఉమేశ్‌ జైన్‌ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories