తెలంగాణలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానంలో ఎన్నికకు ఈసీ కసరత్తు

EC Exercise For Election Of MLC Graduate Post In Telangana
x

తెలంగాణలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానంలో ఎన్నికకు ఈసీ కసరత్తు

Highlights

Telangana: ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Telangana: తెలంగాణ శాసనమండలిలో ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ స్థానం నుంచి ఎంపికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగాం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేడయంతో ఆ స్థానం ఖాళీ అయింది. అందుకు అనుగుణంగా ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 6 వరకు పట్టభద్రులు తమ ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈసీ షెడ్యూల్‌లో తెలిపింది. ఇందుకోసం ఫిబ్రవరి 24న ముసాయిదా జాబితా ప్రకటించనుండగా.. మార్చి 14 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 4న ఫైనల్ జాబితాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories