Earthquake: తెలంగాణలోని పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు

Earthquake: ఆదిలాబాద్, పెద్దపల్లి, జగిత్యాలన జిల్లాల్లో భూకంపం

Sandeep Eggoju
Updated on: 31 Oct 2021 9:16 PM IST
Earthquake in Some Districts in Telangana
X

తెలంగాణలోని పలు జిల్లాలో భూకంపం (ఫైల్ ఇమేజ్)

Earthquake: తెలంగాణలోని పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణంలో గల రహమత్‌పురాలో ప్రకంపనలు వచ్చాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, సలుగుపల్లి గ్రామాల్లో భూమి కంపించింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా స్వల్పంగా మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story