Gangula Kamalakar: మంత్రి గంగుల నివాసంలోనూ సోదాలు..!

E D Searches Properties Related To Minister Gangula Kamalakar
x

మంత్రి గంగుల నివాసంలోనూ సోదాలు

Highlights

* ఎంత నగదు దొరికిందో చెప్పాలని మంత్రి సవాల్

Enforcement Directorate: మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటిపై ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా దాడులు చేయడం కలకలం రేపింది. గత రెండు రోజులుగా మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ స్థానికంగా లేకపోవడంతో అధికారులు మంత్రి గంగులకు వీడియోకాల్‌ చేశారు. తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లవచ్చని మంత్రి చెప్పారు. దీంతో అధికారులు తాళం తీయించి ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారు. విదేశాల్లో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. తమ సంస్థల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని మంత్రి గంగుల స్పష్టం చేశారు. తాము పారదర్శకంగా, ప్రభుత్వ అనుమతులతో వ్యాపారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐటీ, ఈడీ సోదాలు రాజకీయ కోణంలో జరగలేదని అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఎందుకంటే ఈ దాడుల్లో బీజేపీకి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారని గంగుల వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories