DWCRA Groups in Telangana: సంక్రాంతికి ముందే గుడ్‌ న్యూస్‌.. మహిళా సంఘాల కోసం శాశ్వత భవనాలు

DWCRA Groups in Telangana
x

DWCRA Groups in Telangana: సంక్రాంతికి ముందే గుడ్‌ న్యూస్‌.. మహిళా సంఘాల కోసం శాశ్వత భవనాలు

Highlights

DWCRA Groups in Telangana: డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తుండగా, తాజాగా మహిళా సంఘాలకు మరో శుభవార్త చెప్పింది.

DWCRA Groups in Telangana: మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తుండగా, తాజాగా మహిళా సంఘాలకు మరో శుభవార్త చెప్పింది. స్వయం సహాయక సంఘాలు, వాటి ఫెడరేషన్ల కోసం శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలనే లక్ష్యంతో వచ్చే ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో మహిళా సంఘాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎస్‌హెచ్‌జీలు, ఫెడరేషన్‌లకు శాశ్వత కార్యకలాపాల భవనాల నిర్మాణానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ నిర్ణయం మహిళా సంఘాల చరిత్రలో కీలక మలుపుగా నిలుస్తుందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. చాలా కాలంగా మహిళా సంఘాల సభ్యులు శాశ్వత భవనాల కోసం విజ్ఞప్తి చేస్తున్నారని, వారి కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో మహిళా సంఘాలు, గ్రామ సంస్థల కోసం ఈ భవనాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు.

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో భవనానికి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. 200 గజాల స్థలంలో, సుమారు 552 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ భవనాలు నిర్మించనున్నారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల ఫెడరేషన్ భవనం ఏర్పాటు చేసి వారి గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories