తల్లడిల్లిన తల్లి మనసు.. ఐనవారు లేకుండానే కుమారుడి అంతిమయాత్ర

తల్లడిల్లిన తల్లి మనసు.. ఐనవారు లేకుండానే కుమారుడి అంతిమయాత్ర
x
Highlights

కరోనా వైరస్ ప్రజలకు కఠిన పరీక్షలు పెడుతుంది. మనుషుల మధ్య బంధుత్వాలను తెంచుతుంది.

కరోనా వైరస్ ప్రజలకు కఠిన పరీక్షలు పెడుతుంది. మనుషుల మధ్య బంధుత్వాలను తెంచుతుంది. ఎంత మంది ఉన్నా అనారోగ్యంతో తనువు చాలించిన కొడుకుకు అంతిమయాత్ర లేకుండానే శ్మశానానికి తరలించాల్సి వచ్చింది. మోయడానికి నలుగురు మనుషుల లేకపోవడంతో తల్లి, తాత ఆ బాలుడి మృతదేహాన్ని రిక్షాపై తీసుకెళ్లిన వైనం అందరి హృదయాలను కలచి వేస్తుంది. వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సోమవారం ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

భద్రాచలంలోని ఓ కాలనీకి చెందిన ఫరీదా అలియాస్ నాగమణి, ముర్తుజావలి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిద్దరూ కూలిపనులు చేస్తూ జీవనం సాగించే వారు. కాగా పదేళ్ల కిత్రం ఆమె భర్త చనిపోవడంతో కుటుంబ పోషన్ భాధ్యతలు ఫరీదా తీసుకుంది. కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు కొడుకులను పోషిస్తోంది. కాగా రెండేళ్ల క్రితం నుంచి ఆమె రెండో కుమారుడు సాదిక్‌ అలియాస్ జశ్వంత్ (12 ఏళ్లు)కు గుండె సంబంధ సమస్యలు బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆ బాలునికి తీవ్రంగా గుండెలో నొప్పి రావడంతో తల్లి వెంటనే ఆ బాలుణ్ని భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించింది. కాగా బాలుని పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి చికిత్సపొందుతూ మృతిచెందాడు.

లాక్ డౌన్ నేపథ్యంలో బాలుని మరణవార్త తెలిసినప్పటికీ బంధువులెవరూ కడసారి చూపుకు రాలేదు. ఇరుగుపొరుగు వారు కూడా బాలుని అంతిమ సంస్కారాలకు రాలేదు. కనీసం కడుపుకోతతో బాధపడుతున్న ఆ తల్లిని కూడా ఓదార్చడానికి ఓ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో చేసేది ఏమి లేక ఆ బాలుడి తాత వీరన్న తన రిక్షాలో మనవడి మృతదేహాన్ని తీసుకెళ్లి పూడ్చిపెట్టారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories